ఘనంగా 8వ నిజాం అంత్యక్రియలు

ఎనిమిదవ నిజాం ముఖ్రంజా అంత్యక్రియలు ప్రభుత్వ, అధికార లాంచనాలతో మక్కా మసీదులో బుదవారం నాడు ముగిశాయి. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు పాల్గొన్నారు.

అంత్యక్రియలకు ముందు ముఖ్రంజా బౌతికకాయాన్ని చౌమోహల్లా ప్యాలెస్ నుంచి మక్కా మసీదుకు తీసుకొచ్చారు. ఈ అంతిమ యాత్రలో నిజాం ముఖ్రంజా భౌతికకాయాన్ని పోలీసుల గౌవరవందనంతో తీసుకెళ్లారు. అనంతరం మక్కా మసీదులో నిజాం ముఖ్రంజా అంత్యక్రియలు పూర్తిచేశారు.

వేలకోట్ల ఆస్తులకు వారసుడు అయినప్పటికీ ముఖ్రంజా, టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో అద్దెఇంటిలో మరణించిన సంగతి తెలిసిందే.

ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాదులోనే ఖననం చేయడానికి ప్రత్యేకంగా విమానంలో తరలించారు. ప్రత్యేక అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలకు కేసీఆర్ ఆదేశించారు.

Leave a Reply