యువతకు ప్రోత్సాహకంగా టి వర్క్స్

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో “టి వర్క్స్” ని యంగ్ లీయూ హాన్ హై టెక్నాలజి గ్రూప్స్(ఫోస్కాన్) చైర్మన్ మార్చి 2న  ప్రారంభించనున్నారు.అభిరుచి గల వారు, తయారిదారులు, ఆవిష్కర్తల కు ఎంతో తోడ్పడుటమే కాకుండా ప్రయోగాన్ని అన్వేషించటానికి కూడా ఎటువంటి వైఫల్యం లేకుండా ఉండేలా “టి వర్క్స్” ని నిర్మించారు. ఈ నిర్మాణానికి సుమారు 110 కోట్ల పెట్టుబడితో 78000 చ.అ విస్తీర్ణం ని కేటాయించారు. ఇది ఫేజ్ 1గానే ఉంచుతు 250000 చ.అ కు విస్తరించనున్నది అని మినిస్టర్ కె.టి.ఆర్ తెలిపారు.

అయితే ఇది ఎనిమిది ఏళ్ళ క్రిందట ప్రారంభించినప్పటికి, మళ్ళి ఇప్పుడు యంగ్ లీయూ చే ప్రారంభించనున్నారు. మరి ఐ.టి మినిస్టర్ కె.టి.ఆర్, ఐ.టి అండ్ ఇండస్ట్రీస్ ప్రింసిపాల్ జయేష్ రంజన్ స్పెషల్ సెక్రటరి డాక్టర్ ఈ విష్ణు వర్ధన్ రెడ్డి అండ్ “టి వర్క్స్” సి.ఈ.ఓ సుజై కరంపురి హాజరు అయ్యారు. “టి వర్క్స్” లో ఆలోచనలు శిక్షణపొందటానికి వనరులు ఉండేలా సంస్తని రూపొందించారు. అంటే ప్రోడక్ట్ డిజైన్, ఇంజనీరింగ్, ఫ్యాబ్రికేషన్, సోర్సింగ్ మరియు ఇతర అంశాలు “టి వర్క్స్” లో ఉన్నాయి.“టి వర్క్స్”యొక్క సాటిలైట్ సెంటర్స్ను నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట్ మరియు వరంగల్ ఉన్నాయి లేక ఉండనున్నాయి అని తెలియజేశారు.  “టి వర్క్స్” కూడా “టి హబ్” లానే స్వయం సమృద్ది చెందేలా ఉండాలని కె.టి.ఆర్ గారు అన్నారు. ఫోస్కాన్ చైర్మన్ యంగ్ లీయూ ముఖ్య మంత్రి కె.సి.ఆర్ ను ప్రగతి భవన్ లో కలిసారు. ఫోస్కాన్ చైర్మన్ యంగ్ లీయూ హైదరాబాద్ లో పెద్ద పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ పెట్టుబడి వల్ల తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష ఉద్యోగాలు లభ్యంఅయ్యేలా ఉండచ్చు అని ఐ.టి మినిస్టర్ కె.టి.ఆర్ ట్విట్టర్ లో తెలిపారు.

Leave a Reply