ఆస్కార్స్95వ ప్రేసెంటర్ గా దీపికా పదుకొనే
మార్చి 12న జరగనున్న ఆస్కార్స్ 95 లో దీపికా పదుకొనే ప్రేసెంటర్ గా చేయనున్నది.
దీపికా పదుకొనే మార్చి మూడున సోషియల్ మీడియా లో పోస్ట్ పెట్టటం జరిగింది. ఆస్కార్స్ ప్రేసెంటర్ గా రిజ్ అహ్మద్, ట్రాయ్ కొసుర్, ఎమిలీ బ్లంట్, జోనాథన్ మేజర్స్, గ్లెన్ క్లోజ్, మెలిస్సా మెక్కార్తీ, జెన్నిఫర్ కోన్నళ్లి, జేనళ్లి మొనేయి, అరియాన డెబోసే, దీపికా పదుకొనే, సామ్యూయల్ జాక్సన్, క్వెస్ట్లవ్, డ్వేన్ జాన్సన్, జో సాల్డానా, మైఖెల్ బి జోర్డాన్, డోన్నియేన్ వహించారు.
ఇది దీపికా పదుకొనే సోషియల్ మీడియా లో పోస్ట్ పెట్టటంతో ప్రసంసలతో కొనియాడారు. దీపికా పదుకొనే నటించిన ‘పతాన్’ చిత్రానికి భారతదేశంలో రెండు వారాలకి 400ల కోట్లు ఆదాయం వచ్చింది. ప్రపంచస్ధాయి బాక్సాఫిస్ లో 1000 కోట్లు మార్కు జాబితాలో జేరి దీపికా పదుకొనే జయం వైపు అడుగులు వేస్తున్నందుకు భర్త రన్వీర్ సింగ్ దీపికా ఫ్యాన్స్ మరియు బాలీవుడ్ సెలబ్రిటీలు సంతోషంతో అభినందనలు సోషియల్ మీడియాలో తెలియజేశారు. దీపికా పదుకొనే హ్రితిక్ రోషన్ తో నటించనుంది. దీనికి సిద్ధార్ద్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం జనవరి 25న విడుదల కానుంది. దీనితోపాటు ప్రాజెక్ట్ కె చిత్రంలో దీపికా ప్రభాస్ తో సహ నటిగా నటిస్తుంది.
