ఫేస్ రికగ్నిషన్ తో భక్తులకు వేగంగా సేవలు
– డయల్ యువర్ ఈవోలో ఎవి.ధర్మారెడ్డి
శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో మరింత పారదర్శకంగా, వేగంగా సేవలు అందిస్తున్నట్లు టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టిటిడి ఈవో భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
1. సురేష్ – సేలం
ప్రశ్న : ఇటీవల టీటీడీ ప్రారంభించిన ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో గదుల కేటాయింపు, ఉచితంగా రూ.50/- లడ్డు టోకెన్స్ ఇవ్వడం చాలా బాగుంది. రాంబగీచా ఎదురుగా, నందకం వద్ద వున్న టాయిలెట్స్ శుభ్రంగా ఉంచండి.
ఈవో : పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
2. వెంకట రామకృష్ణ – హైదరాబాద్
ప్రశ్న : ఒకేసారి మూడు నెలలకు ఆన్లైన్లో దర్శనం, ఆర్జిత సేవలు విడుదల చేశారు. నెలకు ఒకసారి విడుదల చేస్తే బాగుంటుంది.
ఈవో : కరోనాకు ముందు మూడు నెలలకు ఒకసారి దర్శనం, ఆర్జిత సేవలు టీటీడీ విడుదల చేసేది. కరోనా కారణంగా పరిస్థితిని బట్టి నెలకు ఒకసారి విడుదల చేశాము. కరోనా తగ్గి పోయింది కాబట్టి తిరిగి మూడు నెలలకు ఒకేసారి విడుదల చేస్తున్నాము.
3. సునంద – ఖమ్మం
ప్రశ్న : వయోవృద్ధులు, దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్‌లో గదులు కేటాయించడం వల్ల సౌకర్యవంతంగా ఉంటుంది.
ఈవో : గదుల అందుబాటును బట్టి వృద్ధులు, దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే గదులు కేటాయిస్తున్నాము.
4. రమ్య – హైదరాబాద్ జ్యోతి ` ఏలూరు
ప్రశ్న : శ్రీవారి ఆర్జిత సేవలు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా పొందిన భక్తులకు తిరిగి మూడు నెలలు రాదు. కానీ కొందరు ఆధార్ కార్డు, ఓటర్ కార్డుతో నెల నెలపొందుతున్నారు. అందరికి ఆర్జిత సేవలో శ్రీవారి దర్శనం టికెట్లు పొందేలా చర్యలు తీసుకోవాలి. ఆఫ్లైన్లో కూడా ఇవ్వండి.
ఈవో : ఆధార్ ద్వారానే ఆర్జిత సేవా టికెట్లు పొందేలా ఏర్పాటు చేస్తాం. ప్రతిరోజు లక్కిడిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందేందుకు ముందు రోజు తిరుమలలో పేర్లు రిజిస్టర్ చేసుకుంటే పొందవచ్చు.
5. శంకర్ ` హైదరాబాద్
ప్రశ్న ` ఆన్‌లైన్‌లో లక్కిడిప్ ద్వారా సేవా టికెట్లు పొందిన వాళ్ళకి వసతి ఇచ్చేలా చర్యలు తీసుకోండి.
ఈవో ` పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
6.సుధాకర్ ` గుంతకల్
ప్రశ్న ` టిటిడి భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కళ్యాణి గెస్ట్ హౌస్‌లో లిఫు,్ట గీజర్లు ఏర్పాటు చేయండ.
ఈవో ` గోవర్ధన్, కళ్యాణి, సుదర్శన్ వసతి గృహాలు దాదాపు 60 సంవత్సరాల క్రితం నిర్మించినవి. వాటిని తొలగించి కొత్త వాటిని నిర్మిస్తాము.
7.త్రిమూర్తులు ` అనకాపల్లి
ప్రశ్న ` వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అనధికారికంగా స్నాక్స్, కూల్ డ్రిరక్స్ అమ్ముతున్నారు. దీనివల్ల భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఈవో ` వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అనధికారికంగా స్నాక్స్, కూల్ డ్రిరక్స్ అమ్ముతున్న కొందరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇకపై ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటాం.
8.లక్ష్మి ` హైదరాబాద్
ప్రశ్న ` రూ.100 గదికి రూ.500 రూపాయలు కాషన్ డిపాజిట్ తీసుకుంటున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందిగా ఉంది.
ఈవో` పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.
9.విజయ రామారావు ` విజయవాడ
ప్రశ్న `ఆర్జిత సేవల ధరలు కనీసం రూ.500 చేశారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం టికెట్లను కూడా పెంచారు. గదులు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి బుక్ కావడం లేదు.
ఈవో` దర్శనం టికెటు రూ.300 రూపాయలు. సేవకు హాజరైనందుకు రూ.200 మొత్తం రూ.500. సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా సమస్య ఉంటే పరిశీలించి గదులు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా చేస్తాం.
10. ప్రవీణ్ ` పుట్టపర్తి
ప్రశ్న ` ఆలయ నాలుగు మడ వీధుల్లో ఎండ కారణంగా భక్తులకు కాళ్లు కాలుతున్నాయి. తగిన ఏర్పాట్లు చేయండి.
ఈవో ` కాళ్ళు కాలకుండా వైట్ పెయింట్, మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నాము.
11. మాలతి ` హైదరాబాద్
ప్రశ్న ` అంగప్రదక్షిణ టోకెన్లు ఆఫ్‌లైన్‌లో కూడా తిరుమలలో ఇవ్వండి.
ఈవో ` తిరుమలలో ఆఫ్లైన్లో ఇవ్వడం వల్ల అధిక సమయం వేచి ఉండవలసి వస్తుంది. భక్తుల విజ్ఞప్తి మేరకే ఆన్లైన్లో విడుదల చేస్తున్నాము.
11. రత్నమ్మ` హైదరాబాద్
ప్రశ్న ` విశ్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని, సీనియర్ సేవకురాలిగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. సేవ చేయడానికి అవకాశం కల్పించండి.
ఈవో ` పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
12. భాస్కర్ ` కడప హరిబాబు ` దువ్వాడ
ప్రశ్న ` మార్చి నెలలో గది బుకింగ్‌కు యుపిఐ పేమెంట్ చేసాము. కానీ రసీదు రాలేదు. సాఫ్ట్వేర్ లో ప్రాబ్లం ఏర్పడుతోంది. గదులు ఖాళీ చేసే సమయంలో అక్కడి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
ఈవో ` భక్తులు ఎవరు కూడా డబ్బులు ఇవ్వకండి. ఎవరైనా అడిగితే విజిలెన్స్‌కి కంప్లైట్ చేయండి.
13. సీతారాములు ` ఖమ్మం
ప్రశ్న ` శ్రీవారి కల్యాణోత్సవం టికెట్ బుక్ చేసుకున్నాం. 14 సంవత్సరాల పైబడిన పిల్లలకి టికెట్ రాలేదు. వారిని అనుమతిస్తారా.
ఈవో ` 12 సంవత్సరాలు దాటిన వారు తప్పకుండా రూ.300 టికెట్ తీసుకునే దర్శనానికి వెళ్ళాలి.
14. వినయ్ ` మహబూబ్‌నగర్
ప్రశ్న ` తిరుమలలో జల ప్రసాదం నీరు సరిగా ఉండట్లేదు. ప్లాస్టిక్ బాటిల్ నిషేధించారు. భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
ఈవో` ప్రతిరోజు జలప్రసాద కేంద్రాల్లో నీటిని పరీక్షిస్తాము. డ్యామ్‌లోని నీటిని కూడా పరీక్షించిన తరువాతే సరఫరా చేస్తున్నాం. గదుల కేటాయింపు కేంద్రాల వద్ద త్వరలో తక్కువ ధరకు భక్తులకు టప్పర్ వేర్, రాగి బాటిళ్ళను అందుబాటులో ఉంచుతాం.
15.పవన్ కుమార్ `విశాఖపట్నం
ప్రశ్న` తిరుమల ఆలయంలోకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు కూడా తోపులాట చాలా ఎక్కువగా ఉంటోంది.
ఈవో` భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.
16. రాజేంద్రప్రసాద్ ` పులివెందుల
ప్రశ్న ` మూడు నెలలైనా కాషన్ డిపాజిట్ వెనక్కి రావడం లేదు.
ఈవో ` క్రెడిట్ , డెబిట్ కార్డ్ ద్వారా కాషన్ డిపాజిట్ చెల్లించి ఉంటే మూడు రోజులలో అదే అకౌంట్‌కి డబ్బులు జమ అవుతాయి.
17. పద్మారెడ్డి ` హైదరాబాద్
ప్రశ్న ` క్యూలైన్లలో అన్నప్రసాదాలు, టీ ఇవ్వడం లేదు.
ఈవో ` నిరంతరం సరఫరాచేస్తున్నాం.
18. అశోక్ కుమార్ `హిందూపురం
ప్రశ్న ` నడిచి వెళ్ళే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయండి.
ఈవో ` దివ్యదర్శనం టోకెన్లు జారీపై సర్వే నిర్వహించి, విధి విదానాలు ఖరారు చేస్తాం.
