జి20 విదేశాంగ మంత్రుల సదస్సు
భారత్ విదేశాంగ మంత్రిగా ఎస్. జైశంకర్, చైనా విదేశి వ్యవహారాల మంత్రి క్విన్ గ్యాంగ్ జి20 ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ లో ప్రస్తుత వ్యవహారాలు మరియు ద్వైపాక్షిక సంబందం గురించి చర్చించారు. అతి ముఖ్యంగా ప్రపంచ శాంతి మరియు సరిహద్దుల ప్రాంతాల యొక్క ప్రశాంతత గురించి, జి20 అజెండా గురించి చర్చించుకున్నాము అని భారత్ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ట్విట్టర్ లో తెలిపారు.
మార్చి 1 మరియు మార్చి 2 తేదీన భారతదేశం యొక్క జి20 అధ్యక్షపదవి మీటింగ్ నేపధ్యంలో “వసుదైవ కుటుంబం” ‘ఒన్ ఎర్త్’ ‘ఒన్ ఫామిలీ’ ‘ఒన్ ఫ్యూచర్’ కి జి20 ఫారిన్ మినిస్టర్స్ హాజరు అయ్యి ప్రపంచ సవాళ్లు గురించి చర్చించారు.. వీరు బహుపాక్షికత, ఆహారం మరియు శక్తి భద్రతలు, ప్రతిఫ్టాత్నకమైన వాతావరణం మరియు పర్యావరణ చర్య, సుస్తిర అభివృద్ధిపై లోతైన సహకారం, ఉగ్రవాదాన్ని ఎదుర్కునె సంస్ధ, మాదక ద్రవ్యాలను ఎదుర్కునె సంస్ధ, ప్రపంచ ఆరోగ్యం సంస్ధ, ప్రపంచ టాలెంట్ పూల్, మానవతా సహాయ బ్రందం మరియు విపత్తు ప్రమాదం తగ్గింపు, లింగ సమానత్వం మరియు మహిళా సాధికారతలు గురించి చర్చించుకున్నారు.
ఆయా సంస్ధలు మరింత బలపరచడానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ విదేశి వ్యవహారాల మంత్రులతో చర్చలు జరిగాయి అని తెలిపారు. రష్యా ఉక్రెయిన్ వార్ వలన జరిగే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మీద ఒత్తిడి మరియు నష్టం జరుగుతుందని వెల్లడించారు.
మార్చి 3వ తేదీన ఇండో పసిఫిక్ “క్వాడ సదస్సు” జరగనుంది.ఈ సదస్సు పేరు రైసిన డయలాగ్ 2023. ఈ సదస్సుకు యుఎస్ఎ విదేశాంగ మంత్రి ఆన్టోని బ్లిన్కన్, జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి, ఆస్రేలియా విదేశాంగ మంత్రి పెన్ని వాంగ్ హాజరు అయ్యారు.
