తిరుపతిలో 22ఎ సమస్యను పరిష్కరిస్తాం

-టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి

తిరుపతిలో భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. భూములు రిజిస్ట్రేషన్‌ చేయరాదని ప్రభుత్వానికి పంపిన లేఖను తాత్కాలికంగా నిలిపివేయాలని మరో లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. టీటీడీ భూములను సబ్‌ డివిజన్‌ చేసి వాటి రిజిస్ట్రేషన్లు మాత్రమే నిలిపివేయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

టిటిడికి చెందిన కొన్ని సర్వే నంబర్లలోని విస్తరణం, సబ్‌ డివిజన్ల డ్లూప్లికేషన్‌లను సరిచేసి మరో జాబితాను ఎండోమెంట్స్‌ కమిషనర్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ శాఖకు వివరాలు అందజేస్తామన్నారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ‘డయల్‌ యువర్‌ ఈవో’ కార్యక్రమం అనంతరం మీడియా ప్రతినిధులతో ఈవో మాట్లాడారు.

తిరుపతి జిల్లాలోని తిరుపతి మండలం, తిరుపతి డివిజన్‌లో ఉన్న వివిధ సర్వే నంబర్‌లలో చాలా వరకు విస్తరణలు డూప్లికేషన్ అయ్యాయని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, ఐజిఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌లో ఏర్పడిన పొరపాట్లు సరిదిద్దాతామన్నారు.

దేశవ్యాప్తంగా 7126.85 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న టీటీడీకి చెందిన 960 స్థిరాస్తుల్లో 690 ఆస్తులు 6657.43 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. అందులో తిరుపతిలోనే దాదాపు 3663 ఎకరాలు ఉన్నట్లు చెప్పారు.

వివిధ కోర్టు కేసుల పరిధిలో 584 ఎకరాలు వివాదంలో ఉన్నాయని చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా, డూపి్లకషన్‌ తొలగించి, సబ్‌ డివిజన్లతో సవరించిన జాబితాను ఎండోమెంట్స్‌ కమిషనర్‌కు సమర్పిస్తాం’’ అని ఈవో పునరుద్ఘాటించారు.

Leave a Reply