టీటీడీకి బ్యాటరీ వాహనం విరాళం

ఐడిబిఐ బ్యాంక్ చైర్మన్ శ్రీ రాకేష్ శర్మ గురువారం ఉద‌యం టీటీడీకి సుమారు రూ.7.67 లక్షల విలువైన 6-సీట్లు క‌లిగి బ్యాటరీతో నడిచే ఒక వాహనాన్ని విరాళంగా అందించారు.

శ్రీ‌వారి ఆలయం ముందు వాహనానికి పూజలు నిర్వహించిన అనంతరం ఐడిబిఐ బ్యాంక్ చైర్మన్ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబుకు బ్యాటరీ వాహనం తాళాలు అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఐడిబిఐ బ్యాంక్ ప్రతినిధులు, తిరుమల డిఐ శ్రీ జానకిరామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply