25న మిక్స్‌డ్ బియ్యం టెండర్, వేలం
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యంను మార్చి 25వ తేదీన టెండర్ మరియు వేలం వేయనున్నారు.
ఇందులో మిక్స్ డ్ బియ్యం 11,640 కేజీలు టెండర్ మరియు వేలంలో ఉంచనున్నారు.
ఆసక్తి గలవారు మార్చి 25వ తేదీలోపు కార్యనిర్వహణాధికారి, టీటీడీ పేరిట రూ.2,500/- డిడి తీసి సీల్డ్ టెండర్‌తోపాటు తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం, జనరల్ మేనేజర్(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు సాయంత్రం టెండర్లను తెరవడం జరుగుతుంది.
ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429, నంబర్లలో కార్యాలయం వేళల్లో సంప్రదించగలరు.