23, 24 తేదీల్లో చిత్తూరు నేతలతో నాగబాబు భేటీలు
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారు రెండు రోజులపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశాల నిమిత్తం 23వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటారు. తిరుపతిలోనే బస చేసి నియోజకవర్గాలవారీగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో విడివిడిగా సమావేశం అవుతారు.
మొదట నియోజకవర్గ స్థాయి క్రియాశీలక సభ్యులు, కార్యకర్తలతోనూ, తర్వాత ఆయా నియోజకవర్గాల నాయకులతో భేటీ అవుతారు. ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యచరణపై దిశానిర్దేశం చేస్తారు. ఈ నెల 23, 24 తేదీల్లో ఈ సమావేశాలు ఉంటాయి. మొదటి రోజు ఈ నెల 23వ తేదీ తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు, గంగాధర నెల్లూరు, చంద్రగిరి నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు.
రెండవ రోజు 24వ తేదీ పూతలపట్టు, పలమనేరు, పుంగనూరు, కుప్పం, మదనపల్లె, తంబళ్లపల్లి, చిత్తూరు నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం శ్రీ నాగబాబు గారు తిరుపతి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. శ్రీ నాగబాబు గారితోపాటు పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి, కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్, జనసేన ఆస్ట్రేలియా కో ఆర్డినేటర్ శ్రీ కలికొండ శశిధర్ తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు.