తిరుపతి వాసి కోడికి బెస్ట్ కాక్ అవార్డు ప్రదానం
సంక్రాంతి వేడుకలు పురస్కరించుకొని తమిళనాడులోని పల్లిపట్టు సమీపం ఆర్కే పేటలో మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజులు పాటు కోడిపందెం పోటీలు నిర్వహించారు.
తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వివిధ జాతులకు చెందిన కోళ్లు పోటీల్లో పాల్గొన్నాయి. మూడు రోజులు పాటు నిర్వహించిన పోటీల్లో 386 పందెం కోళ్ళు పోటీపడ్డాయి. అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్కిల్లో రెఫరీల సమక్షంలో పోటీల్లో నిర్వహించారు.
గురువారం సాయంత్రం బహుమతులు ప్రదానం చేయు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తిరుపతి నామాలు వారి పార్టీకి చెందిన విజయ్ అనే వ్యక్తి కోడి 50 సెకండ్లలో విజయం సాధించడంతో ఆ కోడికి బెస్ట్ కాక అవార్డు ప్రధానం చేశారు. అదేవిధంగా గెలుపొందిన కోడిపుంజులకు పోటీ నిర్వహకులు బహుమతులతో సత్కరించారు.
