విశ్వనాథ్ సతీమణి కన్నుమూత
కళాతపస్వి కె విశ్వనాధ్ సతీమణి జయలక్ష్మి గుండెపోటుతో ఆదివారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత మరణించారు. ఆమె వయస్సు ప్రస్తుతం 86 సంవత్సరాలు.
విశ్వనాధ్ మరణించిన కేవలం 24 రోజుల వ్యవధిలో ఆమె కూడా కన్నుమూయడంతో వారి కుటుంబంలో విషాదం అలముకుంది.
తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దర్శకుడు విశ్వనాథ్ ఫిబ్రవరి 2న మరణించిన విషయం తెలిసిందే. విశ్వనాథ్ చనిపోయిన 24రోజులకే ఆయన సతీమణి మరణించడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
