కదిరి పోలీసులతీరుపై రామకృష్ణ ఆగ్రహం
కదిరిలో పోలీసుల తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాన్ని ఎత్తిచూపే జర్నలిస్టులపై పోలీసుల ప్రతాపమా? అని నిలదీశారు.
కదిరిలో జర్నలిస్టులపై ఎస్సీ, ఎస్టీ కేసులు మోపటాన్ని ఖండిస్తున్నామని అన్నారు.
కదిరిలో మహిళలపై వీరంగం సృష్టించిన సీఐ తమ్మిశెట్టి మధుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నామని రామకృష్ణ అన్నారు.
