జగన్‌కు నాదెండ్ల సవాల్
ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి మార్చి ఒకటిన తెనాలి లో జరిగిన పబ్లిక్ సమావేశం లో తెదేపా పార్టి నారా చంద్రబాబు కు మరియు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ కు, దమ్ముంటే 175 నియోజకవర్గాలు అన్నింటా మానిపెస్ట్ లో ఉన్నది ఉన్నట్లు ప్రతి గడప గడపకు చేసి చూపించమని సవాల్ విసురుతూ దమ్ముంటే సింగళ్ గా 175 నియోజకవర్గాల్లలో పోటి చేయమని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
దీనికి జనసేన పార్టీ పి.ఎ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ లో దానికి సమాదానంగా ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి, ఎవరి అజెండా వారికి ఉంటాయి అని, మ్యానఫిస్ట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటూ దమ్ముంటే అన్ని నియోజకవర్గాల్లో రోడ్లు వేయమని, దమ్ముంటే ఐప్యాక్ లేకుండా రమ్మని, దమ్ముంటే 175 నియోజకవర్గాల్లలో రోడ్పైన పర్యటించండి అని అంటూ ఖచ్చితంగా మార్చి 14వ తేదీన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ యోక్క మ్యానఫిస్ట్ ని వివరిస్తారని తెలియజేశారు.
జనసేన పార్టీ మార్చి 14వ తేదీన 10వ ఆవిర్భావ దినోత్సవం మచిలీపట్నంలో 34 ఎకరాల ప్రాంగణం ని సభకు ఏర్పాటు చేయనున్నారు అంటూ పవన్ కళ్యాణ్ మంగళగిరి రాష్ట్ర కార్యాలయం నుండి మచిలీపట్నం సభా ప్రాంగణానికి వారాహి వాహనం లో చేరుకుంటారు అని జనసేన పార్టీ పి.ఎ.సి చైర్మన్ నాదండ్ల మనోహర్ తెలియజేశారు.
భవిష్యత్ లో ఆంధ్రప్రధేశ్ రాష్ట్ర రాజకీయాలు మార్పు కోసం, ప్రజాస్వామ్యం మార్పు కోసం మరియు 175 నియోజకవర్గం సవాల్ గురించి పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడనున్నారు.