కాణిపాకం ఆలయంలో సరికొత్త ఆర్జిత సేవ!

సత్యప్రమాణాలకు నెలవైన వరసిద్ధి వినాయకుని ఆలయంలో కొత్త నిత్యపూజగా సహస్ర నామ అర్చనసేవను ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతించింది. కాణిపాకం ఆలయంలో వినాయకునికి ఈ సహస్ర నామార్చన సేవను ప్రతిరోజూ నిర్వహిస్తారు. దీనికి రూ.1000 రుసుముగా నిర్ణయించారు.

కాణిపాకం వరసిద్ధి వినాయకుడు ప్రమాణాలకు పేరుగాంచిన దేవుడు. ఇటీవలే ఆలయాన్ని ఎంతో వైభవమైన స్థాయిలో పునరుద్ధరించారు. గత ఏడాది వినాయకచవితి సందర్భంగా మహాకుంభాభిషేకం కూడా నిర్వహించారు.

ఇటీవల వివిధపూజలకు రుసుములు పెంచుతూ ఈవో నిర్ణయం తీసుకోవడం అనేది చాలా పెద్ద రాద్ధాంతం అయింది. ఆ తర్వాత ఆ రుసుముల విషయంలో వెనక్కు తగ్గారు.

తాగాజా సహస్ర నామార్చన సేవను ప్రారంభించారు. అనుదినం జరిగే ఈ సేవకు రూ.1000 ధర నిర్ణయించారు.

Leave a Reply