లక్ష్మీనరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆదివారం సంప్రదాయబద్ధంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరుపున టీటీడీ వస్ర్తాలను సమర్పించింది.
టిటిడి తరపున పారుపత్తేదార్ శ్రీ ఉమా మహేశ్వర రెడ్డి అహోబిలం దేవస్థానం ప్రధాన అర్చకుడు శ్రీ కెపి వేణుగోపాలకు శ్రీవారి సారె ను అందించారు.
శ్రీ లక్ష్మీ నరసింహ కల్యాణం సందర్భంగా టిటిడి సమర్పించిన పట్టు వస్త్రాలను ఆదివారం సాయంత్రం అలంకరించనున్నారు.
